Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభSreeleela LEELA: హాట్ అండ్ క్రేజీ హీరోయిన్ చేతిలో 9 సినిమాలు

Sreeleela LEELA: హాట్ అండ్ క్రేజీ హీరోయిన్ చేతిలో 9 సినిమాలు

శ్రీలీల మన తెలుగమ్మాయి ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న లీడ్ యాక్ట్రెస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. టాప్ హీరో అయినా జూనియర్ హీరో అయినా, హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా అందరికీ ఇప్పుడు ఈ అమ్మాయే టాప్ ఛాయిస్ గా మారారు. ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల ఇప్పుడు అందరి చూపులు తనవైపే తిప్పుకుంటున్నారు.

- Advertisement -

ఏకంగా 9 సినిమాలకు కాల్ షీట్స్ ఇచ్చి తన డైరీని ఫుల్ బిజీగా పెట్టుకుంది ఈ బ్యూటీ. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న #SSMB28 లోనూ ఈ అందగత్తె ఛాన్స్ కొట్టేశారు. అనగనగా ఒక రోజు అనే సినిమాలో కూడా ఈమె లీడ్ రోల్ కోసం బుక్ అయ్యారు.

గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న జూనియర్ అనే మూవీలోనూ ఈమెనే హీరోయిన్. ఇంకా పేరు ఖరారు కాని బోయపాటి సినిమాలోనూ లేడీ లీడ్ రోల్ లో శ్రీలీల సైన్ చేశారు. NBK108లోనూ ఈమె యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నందమూరు బాలయ్య కుమార్తెగా ఈ అనిల్ రావిపూడి సినిమాలో శ్రీలీల చేయటం ఖాయమైనట్టు సమాచారం.

పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ పక్కన ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల సీనియర్, జూనియర్ హీరోల ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. హరీష్ శంకర్-పవన్ కాంబోలో వచ్చ్ క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీల ఛాన్స్ కొట్టేయటం హైలైట్. పంజా వైష్ణవ్ తేజ్ 04 #PVT4 సినిమాలోనూ ఈమెనే హీరోయిన్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ-గౌతం తిన్ననూరి రొమాంటిక్ సినిమాలోనూ శ్రీలీలనే. నితిన్- వక్కంతం వంశీ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుండగా ఇక అఫిషియల్ గా అనౌన్స్ చేయటమే పెండింగ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News