Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభSreeleela: సుకుమార్ మూవీలో మ‌రోసారి శ్రీలీల స్పెష‌ల్ సాంగ్ - కిస్సిక్‌ను మించిపోయేలా!

Sreeleela: సుకుమార్ మూవీలో మ‌రోసారి శ్రీలీల స్పెష‌ల్ సాంగ్ – కిస్సిక్‌ను మించిపోయేలా!

Sreeleela Special Song: పుష్ప‌2 లోని కిస్సిక్ సాంగ్‌లో మాస్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసింది శ్రీలీల‌. అల్లు అర్జున్‌తో పోటీప‌డి డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది. పుష్ప 2తోనే తొలిసారి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది ఈ ముద్దుగుమ్మ‌. కిస్సిక్ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి ఐటెం సాంగ్ ఆఫ‌ర్లు భారీగానే వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా మ‌రోసారి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో శ్రీలీల ఆడిపాడ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

- Advertisement -

మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ…
తండేల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య ఓ మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా ఈ సినిమా రూపొందుతోంది.

సుకుమార్ వ‌ల్లే…
నాగ‌చైత‌న్య సినిమాలో శ్రీలీల ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప‌2 త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసే ఆఫ‌ర్స్ వ‌చ్చినా రిజెక్ట్ చేసిన శ్రీలీల.. నాగ‌చైత‌న్య సినిమాకు మాత్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పుష్ప 2 డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్ కావ‌డమే అందుకు కార‌ణం అని అంటున్నారు. నాగ‌చైత‌న్య సినిమాకు శ్రీలీల సాంగ్ ఓ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంద‌ని చెబుతోన్నారు. కిస్సిక్‌ను మించిపోయేలా ఉంటుంద‌ని స‌మాచారం.

మేకోవ‌ర్‌…
నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న 24వ సినిమా ఇది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఈ సినిమా కోసం నాగ‌చైత‌న్య ఫిజిక‌ల్‌గా మేకోవ‌ర్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇదివ‌ర‌కు చూడ‌న‌టువంటి కొత్త లుక్‌లో అత‌డు క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఈ మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి పుష్ప 2కు బీజీఎమ్ స‌మ‌కూర్చిన అజ‌నీష్ లోక‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

బ్యాడ్ టైమ్ కంటిన్యూ…
మ‌రోవైపు తెలుగులో శ్రీలీల బ్యాడ్‌టైమ్ కంటిన్యూ అవుతోంది. పెళ్లి సంద‌డి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధ‌మాకా, భ‌గ‌వంత్ కేస‌రిల‌తో విజ‌యాల‌ను ద‌క్కించుకున్న‌ది. ఈ స‌క్సెస్‌ల‌తో టాలీవుడ్‌లో ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. స్కంద‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌, ఆదికేశ‌వ‌, గుంటూరు కారంతో పాటు ప‌లు బిగ్ బ‌డ్జెట్ మూవీస్‌లో హీరోయిన్‌గా న‌టించింది. కానీ ఈ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టి శ్రీలీల‌కు నిరాశ‌నే మిగిల్చాయి. రీసెంట్ మూవీ రాబిన్‌హుడ్ కూడా ఈ డిజాస్ట‌ర్స్ లిస్ట్‌లోనే చేరింది. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల‌. ఈ ఏడాది హీరోయిన్‌గా బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News