ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్ బ్యాంకుకు కాల్ చేసి ఫిక్స్‌డిపాజిట్ బ్రేక్ చేసి దీపకు డబ్బులు ఇచ్చిన విషయాన్నితెలుసుకుంటాడు. హోమానికి వెళ్తావుగా అక్కడ నేను ఇంకా బాగా చేయిస్తాను అంటాడు. రేపు మీ అందరితో కబడ్డీ ఆడుకుంటాను అంటాడు. మరుసటిరోజు దీప, కార్తిక్ శౌర్య కలిసి హెమం చేస్తూఉంటారు. కాంచన పుట్టింటి వాళ్లు రాలేదు అని బాధపడడం చూసి కార్తిక్ ఎవరు రారు అని మనసులో అనుకుంటాడు. తర్వాత పంతులు కాంచన పుట్టింటి వాళ్లు కానీ, దీప పుట్టింటి వాళ్లు కానీ వాళ్లకు బట్టలు పెట్టాలి అంటే కాంచన బాధపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్లకి నేనే అన్నీ ఇంకెవరూ లేరు అని కార్తిక్ సమాధానమిస్తాడు. అన్యాయం చేసింది, అనాధలా వదిలేసింది వాళ్లు నేేన కాదు నేనే బట్టలు పెడతాను అని కార్తిక్ అంటుంటే ఈలోగా కార్ వచ్చి ఆగుతుంది.
హోమానికి వచ్చిన సుమిత్ర, దశను చూసి అందరూ షాక్ అవుతారు. కాంచన సంతోషంగా అన్నయ్యా వదినా అని పిలుస్తుంది. వీళ్లని ఎవరు పిలిచారు అంటే నేనే పిలిచాను అని దీప అంటుంది. సుమిత్ర, దశరథ రాకతో అక్కడి వాతావరణం అంతా సంతోషాలతో నిండిపోతుంది. ఈలోగా అక్కడికి కావేరి వస్తే అందరూ మళ్లీ షాక్ అవుతారు. ఎందుకు వచ్చారు అని అందరూ అలా చూస్తూ ఉంటారు. కాంచన, దశరథలు మాత్రం పిలవకుండా ఉండి ఉంటే బాగున్ను అనుకుంటారు. మా నాన్నని కుడా పిలిచావా అంటే లేదు అంటుంది. అప్పుడే శ్రీధర్ కుడా ఎంట్రీ ఇస్తాడు. వచ్చి ఊరుకోకుండా సూటిపోటి మాటలు మాట్లాడుతాడు.
అలా హోమాం పూర్తయిన తర్వాత కార్తిక్ కోపంతో లోపలికి వచ్చేస్తాడు దీప కుడా లోపలికి వెళ్లి కార్తిక్‌ను బ్రతిమాలడానికి వెళ్తే తిడతాడు. ఈలోగా శ్రీధర్ లోపలికి వచ్చి గోల చేస్తుంటే అదరూ వెళ్లిపోమన్నా వెళ్లకుండా నా గౌరవం నా విలువ నేను అందరికీ తెలిసేలా చేసుకోవాలిగా అని శౌర్య ఆపరేషన్‌కి డబ్బులు ఎవరు ఇచ్చారు అని మొదలుపెడతాడు. ఒక మనసున్న మహారాజు అని కార్తిక్ అంటే ఎవరు ఆ మనిషి పోనీ నేను చెప్పనా ఆ మనిషి ఎవరో అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..