Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభThe Paradise: సైలెంట్ కాదు.. సెట్లో మాన్‌స్టర్.. ఓదెల బర్త్‌డే గ్లింప్స్ గూస్‌బంప్స్

The Paradise: సైలెంట్ కాదు.. సెట్లో మాన్‌స్టర్.. ఓదెల బర్త్‌డే గ్లింప్స్ గూస్‌బంప్స్

Srikanth Odela Birthday Glimpse: ‘దసరా’తో తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’ ద్వారా మరో పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, ముఖ్యంగా దర్శకుడు ఓదెల పనితీరును చూపించిన మేకింగ్ వీడియో, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. నాని హీరోగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎపిక్‌ను SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ చూస్తుంటే, ఇందులో నాని క్యారెక్టర్ ‘జడల్’ చాలా వైలెంట్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. 1980ల నాటి సికింద్రాబాద్ స్లమ్స్ బ్యాక్‌డ్రాప్‌లో, అణిచివేతకు గురైన ఒక వర్గానికి నాయకుడిగా నాని కనిపిస్తారని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌లో “చరిత్ర ఎప్పుడు మొదలవుతుందంటే.. దానిమీద రక్తం పడినప్పుడు ఓపెన్ అవుతుంది” లాంటి డైలాగ్‌లు ఈ సినిమా ఇంటెన్సిటీని, రస్టిక్ యాక్షన్ జోనర్‌ను స్పష్టంగా తెలియజేశాయి.

ఇటీవల రిలీజ్ అయిన శ్రీకాంత్ ఓదెల బర్త్‌డే గ్లింప్స్, సెట్స్‌లో ఆయన ప్యాషన్ ఏంటో చూపించింది. నిజ జీవితంలో చాలా సైలెంట్‌గా, ఇంట్రోవర్ట్‌గా ఉండే ఓదెల, కెమెరా ముందు మాత్రం పూర్తిగా మారిపోయి,సెట్ లో ‘మాన్‌స్టర్’ లాగా తన టీమ్‌కి, నటీనటులకు సీన్స్ వివరించే విధానం చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. బురదలో కూర్చుని కూడా షాట్స్ గురించి మాట్లాడుతున్న తీరు, ఆయన క్రియేటివ్ డెడికేషన్‌ను తెలియజేస్తోంది. ఈ వీడియోకి అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు మరింత కిక్ ఇచ్చి, గూస్‌బంప్స్ తెప్పించింది.

ALSO READ: Harish Shankar: DSPపై హరీష్ శంకర్ కామెంట్స్.. థమన్‌ని ఉద్దేశించేవేనా?

‘ది ప్యారడైజ్’ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో (ఇంగ్లీష్, స్పానిష్‌తో కలిపి) పాన్-ఇండియా స్థాయిలో మార్చి 26, 2026న విడుదల చేయాలని మేకర్స్ దృఢంగా ఉన్నారు. మొత్తానికి, శ్రీకాంత్ ఓదెల అద్భుతమైన విజన్, నాని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్‌తో ఈ చిత్రం మరో వంద కోట్ల బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News