Thursday, February 6, 2025
Homeచిత్ర ప్రభShekar Basha: శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ పోలీసులకు ఫిర్యాదు

Shekar Basha: శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ పోలీసులకు ఫిర్యాదు

బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా(Shekar Basha)పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ(Srishti Verma) నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసు విచారణ జరుగుతుండగా తన ఫోన్ కాల్స్ రికార్డులు లీక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన పరువుకు భంగం వాటేలా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో శేఖర్ బాషా మాట్లాడుతున్నాడని తెలిపింది. అతడి వ్యక్తిగత మొబైల్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని కోరింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ బాషాపై బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

కాగా శేఖర్ బాషాపై హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా, మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. తన ఇంట్లో 140 గ్రాముల డ్రగ్స్ పెట్టి ఇరికించేందుకు చూస్తున్నారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News