Monday, January 13, 2025
Homeచిత్ర ప్రభKTR: కారు రేసింగ్‌లో విజయం.. అజిత్‌పై కేటీఆర్ ప్రశంసలు

KTR: కారు రేసింగ్‌లో విజయం.. అజిత్‌పై కేటీఆర్ ప్రశంసలు

దుబాయ్ వేదికగా జరుగుతున్న 24H దుబాయ్‌ కారు రేసింగ్‌లో ‘అజిత్‌ కుమార్ రేసింగ్‌’ టీమ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్(Ajith) టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు అజిత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా అజిత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రేసింగ్ మీద ఆయనకున్న ఫ్యాషనే విజయానికి చేరువ చేసిందని అన్నారు. ఎంతో మందికి అజిత్ ఆదర్శనం అని కొనియాడారు.

- Advertisement -

ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘విదా ముయార్చి’మూవీలో నటిస్తున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్‌ సరసన సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే మరో సినిమాలోనూ అజిత్ నటిస్తున్నారు. దీనికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News