Jatadhara: సుధీర్ బాబుకు కాలం కలిసి రావట్లేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన హిట్ ఫిల్మ్ ‘సమ్మోహనం’ (2018) తర్వాత అతను నటించిన సినిమాలేవీ థియేట్రికల్‌గా విజయం సాధించలేకపోయాయి. అతని లేటెస్ట్ ఫిల్మ్ ‘జటాధర’తో డిజాస్టర్లలో అరుదైన ట్రిపుల్ హ్యాట్రిక్‌ను సాధించిన హీరోగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ‘నన్ను దోచుకొందువటే’ సినిమా నుంచి ‘జటాధర’ వరకూ అతను నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇంకా చెప్పాలంటే అవన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ఆర్.ఎస్. నాయుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ‘నన్ను దోచుకొందువటే’ (2018) మూవీలో సుధీర్ జోడీగా గ్లామరస్ యాక్ట్రెస్ నభా నటేశ్ నటించింది. ఆర్. ఇంద్రసేన దర్శకత్వం వహించిన థ్రిల్లర్ ‘వీర భోగ వసంతరాయలు’ (2018)లో టైటిల్ రోల్‌ను శ్రీవిష్ణు చేయగా, నారా రోహిత్, సుధీర్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రలు చేశారు. ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ‘వి’ (2000) మూవీలో సుధీర్ హీరోగా నటిస్తే, నాని విలన్ రోల్ చేయడం విశేషం. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేదు.
Also Read: Lokesh Kanagaraj: హీరోగా డెబ్యూ మూవీ కోసం షాకింగ్ రెమ్యూనరేషన్ – లోకేష్ కనగరాజ్ తగ్గేదేలే
కరుణ కుమార్ రూపొందించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ (2021) మూవీ సైతం నిరుత్సాహానికి గురి చేసింది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ఆనంది హీరోయిన్. మోహనకృష్ణ డైరెక్షన్‌లో సుధీర్ చేసిన మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (2022)లో అప్పటి సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ అయినా లాభం లేకపోయింది. మహేశ్ సూరపనేని డైరెక్షన్‌లో సుధీర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హంట్’ (2023). మలయాళం హిట్ ఫిల్మ్ ‘ముంబై పోలీస్’కు రీమేక్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బాంబ్‌గా నిలిచింది.
రచయిత, నటుడు అయిన హర్షవర్ధన్ డైరెక్ట్ చేయగా, సుధీర్ డబుల్ రోల్ చేసిన ‘మామా మశ్చీంద్ర’ (2023) మూవీ బాక్సాఫీస్ దగ్గర జీరో షేర్ సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లు. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ‘హరోం హర’ (2024) ఆడియెన్స్‌ను తీవ్రంగా నిరాశపరచింది. ఈ మూవీలో మాళవికా శర్మ హీరోయిన్. కంకర అభిలాష్ రెడ్డి రూపొందించిన ఫ్యామిలీ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో’ (2024). హృదయాన్ని తడిచేసే సినిమాగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యింది.
Also Read: Re Releases: ‘శివ’ నుంచి ‘బిజినెస్ మ్యాన్’ వరకు రీ రిలీజ్‌ల హవా!
ఇప్పుడు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ (2025)లో సోనాక్షి సిన్హా కీలక పాత్ర చేయడం విశేషం. అయినా ఈ సినిమాని సైతం ప్రేక్షకులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా సినిమాలు ఫెయిల్ అవడంతో హీరోగా సుధీర్ బాబు కెరీర్ అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోందని చెప్పాలి. స్క్రిప్టుల ఎంపిక విషయంలో చేస్తున్న తప్పులను తెలుసుకొని, కమర్షియల్‌గా విజయం సాధించే స్క్రిప్టుల్ని అతను ఎంచుకుంటాడో, లేదో.. కాలమే చెప్పాలి.


