Homeచిత్ర ప్రభJatadhara OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్‌బాబు హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Jatadhara OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్‌బాబు హార‌ర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Jatadhara OTT: సుధీర్ బాబు హీరోగా న‌టించిన లేటెస్ట్ హార‌ర్ మూవీ జ‌టాధ‌ర స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. జ‌టాధ‌ర మూవీలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌ట క‌ళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

- Advertisement -

సుధీర్ బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా జ‌టాధ‌ర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ఐదు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకుని నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

Also Read- Charan-Sukumar: చరణ్-సుకుమార్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్!

జ‌టాధ‌ర మూవీతోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆత్మ‌గా క‌నిపించింది. మ‌రోవైపు మ‌హేష్‌బాబు వదిన శిల్పా శిరోద్క‌ర్ కూడా లాంగ్‌ గ్యాప్ త‌ర్వాత జ‌టాధ‌ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ ఇద్ద‌రికి ఈ సినిమా నిరాశ‌నే మిగిల్చింది. ధ‌న పిశాచి అనే కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్లు వెంక‌ట క‌ళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ జ‌టాధ‌ర‌ను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నా ఇంట్రెస్టింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌క‌ద్వ‌యం త‌డ‌బ‌డ‌టంతో ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఈ సినిమాలో ఘోస్ట్ హంట‌ర్ పాత్ర‌లో సుధీర్ బాబు క‌నిపించాడు. ద‌య్యాలు లేవ‌ని న‌మ్ముతుంటాడు శివ ‌(సుధీర్‌బాబు). మూఢ‌న‌మ్మ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే అనుకోకుండా రుద్రారం అనే గ్రామానికి వెళ‌తాడు. ఆ గ్రామంలోని ధ‌న‌పిశాచి గురించి శివ ఏం తెలుసుకున్నాడు? ధ‌న పిశాచి వ‌ల్ల శివ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జ‌రిగింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Also Read- Akhanda 2: అఖండ 2 రిలీజ్ వాయిదా – రెమ్యూన‌రేష‌న్ వ‌దులుకున్న బాల‌కృష్ణ‌?

జ‌టాధ‌ర‌తో వ‌రుస‌గా ప‌దో ఫ్లాప్‌ను అందుకున్నాడు సుధీర్ బాబు. 2018లో వ‌చ్చిన స‌మ్మోహ‌నం త‌ర్వాత సుధీర్‌బాబు కెరీర్‌లో స‌రైన హిట్టు లేదు. జ‌టాధ‌ర కంటే ముందు సుధీర్‌బాబు న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో, హ‌రోంహ‌ర‌, మామా మ‌శ్చీంద్ర‌, హంట్‌తో పాటు మిగిలిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం క‌మ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News