Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభGalodu : సుడిగాలి సుధీర్ హిట్ కొట్టేశాడుగా.. సుధీర్‌కి ఈ రేంజ్ కలెక్షన్సా??

Galodu : సుడిగాలి సుధీర్ హిట్ కొట్టేశాడుగా.. సుధీర్‌కి ఈ రేంజ్ కలెక్షన్సా??

Galodu : తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగి తనకున్న అన్ని ట్యాలెంట్స్ ని చూపించి అనేకమంది అభిమానులని సంపాదించుకున్నాడు. బుల్లితెరపై రారాజుగా వెలుగుతూనే వెండితెరపై కూడా తనని చూసుకుంటున్నాడు. ఇన్నాళ్లు పలు సినిమాల్లో కమెడియన్ గా నటించిన సుడిగాలి సుధీర్ ఇటీవల హీరోగా కూడా ట్రైల్స్ వేస్తున్నాడు.

- Advertisement -

సుధీర్ హీరోగా మొదటిసారి తన కామెడీని నమ్ముకొని సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన 3 మంకీస్ కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ మొదటిసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా ఓ స్టార్ హీరో సినిమా రేంజ్ లో గాలోడు అనే సినిమాని తెరకెక్కించారు. ఫుల్ మాస్ తో ఉన్న ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 18న సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు సినిమా రిలీజయింది.

దాదాపు 300కి పైగా థియేటర్స్ లో గాలోడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి 2.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అస్సలు ఒక్క సినిమా కూడా లేని సుధీర్ కి ఈ రేంజ్ బిజినెస్ అంటే ఎక్కువే. అయితే మొదటి రోజే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ దాదాపు కోటి రూపాయల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందుఇ ఈ సినిమా. అంటే దాదాపు 50 లక్షల షేర్ వసూళ్లు రాబట్టాడు సుధీర్. సినిమాకి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది.

సుధీర్ సినిమా హిట్ కొట్టాలంటే 3 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మొదటి రోజు 50 లక్షలు వచ్చేయడంతో వీకెండ్ రెండు రోజులు, ఈ వీక్ లోనే మిగిలిన అమౌంట్ వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో సుధీర్ మంచి విజయం సాధించినట్టే. సినిమాలో కూడా తన యాక్షన్, కామెడీ, రొమాన్స్ సీన్స్ తో అదరగొట్టాడు అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News