Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభSuniel Narang: మూడోసారి గెలుపు.. ఒక్కరోజులోనే రాజీనామా

Suniel Narang: మూడోసారి గెలుపు.. ఒక్కరోజులోనే రాజీనామా

SUNIEL NARANG RESIGNS AS TFCC: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కొత్త అధ్యక్షడు సునీల్‌ నారంగ్‌ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. పదవి చేపట్టిన 24గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయడంతో తెలుగు సినీ వర్గాల్లో సంచలనమైంది. తనని సంప్రదించకుండానే కొందరు వారి ఇష్టాల మేరకు ప్రకటనలు ఇస్తున్నారని నారాంగ్ ఓ నోట్ విడుదల చేశారు. తన ప్రమేయం లేకుండా విడుదల చేసే ప్రకటనలకు తాను బాధ్యత వహించను అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా TFCC అధ్యక్ష పదవిలో కొనసాగాలేనని స్పష్టం చేశారు.

- Advertisement -

ముచ్చటగా మూడోసారి…


హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఛాంబర్​కు కొత్తగా ఎన్నికైన పాలక మండలిని శనివారం హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో సునీల్ నారంగ్‌ మూడోసారి అధ్యక్షుడిగా, కార్యదర్శితో పాటుగా 15 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సునీల్ నారంగ్‌ ఇటీవల ఇండస్ట్రీలో నెలకొన్న థియేటర్ల సమస్యపై మాట్లాడారు. థియేటర్ల పంపిణీ వ్యవహారంలో.. యాజమాన్యాల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని ఆ నలుగురు అంటూ ఎవరు లేరని నారంగ్ పేర్కొన్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో హీరోలు దేవుళ్లు అంటూ, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలతో సహా వాళ్లకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News