Homeచిత్ర ప్రభMahesh Babu: సౌత్‌లో సూపర్ స్టార్ మహేష్ స‌రికొత్త రికార్డ్

Mahesh Babu: సౌత్‌లో సూపర్ స్టార్ మహేష్ స‌రికొత్త రికార్డ్

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాదు… బిజినెస్‌లోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నాడు. యాక్టింగ్‌తో పాటు వ్యాపారాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తూ మహేష్ సౌత్ ఇండస్ట్రీలోనే ముందుగా థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన హీరోగా అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ పేరుతో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన మ‌న సూప‌ర్‌స్టార్ బాట‌లో అల్లు అర్జున్, ర‌వితేజ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్ కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

తాజాగా మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు యాడ్ కాబోతున్న‌ట్లు సమాచారం. ఇంత‌కీ ఏంటా రికార్డ్ అనే వివ‌రాల్లోకెళ్తే.. ప్రస్తుతం మ‌న దేశంలో పుణెలో మాత్రమే ఉన్న అతిపెద్ద డాల్బీ సినిమాస్ థియేటర్ తరహాలో, అంతకుమించిన స్థాయిలో ఒక భారీ డాల్బీ సినిమాస్ థియేటర్‌ను మహేష్ బాబు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. సొంతంగా ఇలాంటి థియేటర్ నిర్మిస్తున్న తొలి హీరోగా మహేష్ హిస్ట‌రీ క్రియేట్ చేస్తున్నారు.

Also Read – Allu Arjun: అమెరికాకు బ‌న్నీ.. న్యూ ఇయర్ ప్లానింగ్

మహేష్ బాబు బిజినెస్ నిర్ణయాల వెనుక ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తారన్న విషయం ఇండస్ట్రీలో తెలిసిందే. ఏ యాడ్ చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావాలన్నా నమ్రతే తుది నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు చెబుతుంటారు. ఆమె వ్యాపార వ్యవహారాలన్నింటినీ సమర్థవంతంగా చూసుకుంటుండటంతో, మహేష్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టగలుగుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టైటిల్ గ్లింప్స్, సంచారి సాంగ్, కీలక పాత్రల పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read – Radhika Apte: మితిమీరిన హింస.. డబ్బుల కోసం కొందరు హీరోయిన్లు.. బాధను వ్యక్తం చేసిన రాధిక ఆప్టే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News