Superstar Mahesh: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌కు అనుకోని షాక్ తగిలింది. ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు కారణం ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఓ రియల్ స్టేట్ కంపెనీ చేసిన నిర్వాకం. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ హీరోల్లో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేసే హీరో ఎవరంటే అది మహేష్ మాత్రమే. పలు కంపెనీ ఉత్పత్తులకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల ముందు సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేజ్ సంస్థకు సంబంధించిన యాడ్‌లో సైతం ఆయన నటించారు. ఇప్పుడిదే ఆయనకు సమస్యగా మారింది.
సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదులో, సాయి సూర్య డెవలపర్స్‌ను మొదటి ప్రతివాదిగా, ఆ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, మరియు ప్రచారకర్తగా సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చారు. ఒక వైద్యురాలు, మరొక వ్యక్తి కంచర్ల సతీష్ చంద్రగుప్తా చెప్పిన మాటలు నమ్మి, బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రూ.3480000 చెల్లించారు. డబ్బులు చెల్లించే సమయంలో ఈ వెంచర్‌కు సంబంధించిన బ్రోచర్‌లో మహేశ్‌బాబు ఫోటో ఉండటం, అందులో పేర్కొన్న వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై తాము ఈ భారీ మొత్తం చెల్లించామని ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/gallery/actress-payal-rajput-latest-hot-photos/
తర్వాత అక్కడ ఎటువంటి లేఅవుట్ లేదని వారికి తెలిసిన తర్వాత వారు తమ డబ్బును తిరిగి ఇవ్వమని కోరగా అతి కష్టం మీద వాయిదాల రూపంలో 15 లక్షల రూపాయలు మాత్రమే వాయిదాల్లో తిరిగి ఇచ్చారు. మిగిలిన డబ్బును తిరిగి ఇవ్వడంలో రెండో ప్రతివాది ఆలస్యం చేస్తూ, వారిని ముఖం చాటేయడంతో ఫిర్యాదుదారులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో వినియోగదారుల కమీషన్ నోటీసులను జారీ చేసింది.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో మహేష్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో మహేష్ బిజీగా ఉంటున్నాడు.