Wednesday, November 19, 2025
Homeచిత్ర ప్రభSuriya: బాలా సినిమా నుంచి తప్పుకున్న సూర్య.. కారణం ఏంటంటే?

Suriya: బాలా సినిమా నుంచి తప్పుకున్న సూర్య.. కారణం ఏంటంటే?

- Advertisement -

Director Bala : తమిళ్ స్టార్ డైరెక్టర్ బాల గతంలో సూర్యతో శివపుత్రుడు, నంద సినిమాలు తీసి మంచి విజయాలు సాధించి అవార్డులు సాధించారు. ఇటీవల కొన్ని నెలల క్రితం వీరి కాంబోలో మరో సినిమాని అనౌన్స్ చేశారు. సూర్య నిర్మాణంలో బాల దర్శకత్వంలో ‘వనన్‌గన్’ సినిమా మొదలుపెట్టారు. తెలుగులో అచలుడు పేరుతో ఈ సినిమాని ప్రకటించారు.

ఒక హీరోయిన్ గా కృతిశెట్టిని కూడా తీసుకున్నారు ఈ సినిమాలో. కన్యాకుమారిలో మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే సూర్య కథలో కొన్ని మార్పులు అడగడంతో డైరెక్టర్ బాల ఒప్పుకోలేదట. దీంతో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీనిపై బాల అధికార ప్రకటన చేస్తూ.. సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. త్వరలోనే మరో హీరోతో ఈ సినిమాని మొదలుపెడతాం అని తెలిపారు.

ఈ హిట్ కాంబోలో సినిమా ఆగిపోవడంతో సూర్య అభిమానులు నిరాశ చెందుతున్నారు. అలాగే కృతి శెట్టికి ఇది తమిళ్ లో మొదటి సినిమా. మొదటి సినిమానే ఇలా అవ్వడంతో కృతి కూడా బాధపడుతుందట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News