Thursday, January 15, 2026
Homeచిత్ర ప్రభTaapsee Pannu : టాలీవుడ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Taapsee Pannu : టాలీవుడ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

- Advertisement -

Taapsee Pannu : ఝుమ్మంది నాదం సినిమాతో పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. టాలీవుడ్ లోనే తన మొదటి సినిమా నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఆ వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడే సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయింది తాప్సీ.

ఇక ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కంగనా లాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తుంది. త్వరలో తాప్సీ బ్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ తనకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఒక కెరీర్ ఇచ్చినా గతంలో కూడా తాప్సీ టాలీవుడ్ పై విమర్శలు చేసింది.

తాజగా బ్లర్ సినిమా ప్రమోషన్స్ లో తాప్సీ మాట్లాడుతూ.. ”నేను మాట్లాడే ప్రతి మాట ఆలోచించే మాట్లాడతాను. మీరు తప్పుగా అర్ధం చేసుకుంటే నేనేమి చేయలేను. ప్రస్తుతం నేను వరుసగా సినిమాలు చేస్తున్నాను. టాలీవుడ్ లో కంటే నాకు బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి” అని అంది. దీంతో మరోసారి తాప్సీని టాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News