Taapsee Pannu: ఢిల్లీ భామ సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను సినిమాలకి గుడ్ బై చెప్పబోతుందా..? ప్రస్తుతం అవుననే మాట సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. తెలుగులో ఈ బ్యూటీ ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ రవితేజ, మంచు మనోజ్, మంచు విష్ణు, గోపీచంద్, వెంకటేష్ లాంటి హీరోలతో నటించింది. అయితే తెలుగులో తాప్సీకి ఆశించిన విజయాలు దక్కలేదు. ఏదో చెప్పుకోవడానికి గుండెల్లో గోదారి, మిస్టర్ పర్‌ఫెక్ట్, సాహసం లాంటి కొన్ని సినిమాలు తప్ప.
ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేసినా కూడా తాప్సీ తెలుగులో నిలబడలేకపోయింది. ఇక, హిందీలో అవకాశాలు అందుకుంది. అక్కడ ప్రారంభంలో జుడ్వా 2 లాంటి సినిమాలో అందాలు ఆరబోసిన తాప్సీ ఆ తర్వాత మాత్రం కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ బలమైన పాత్రలను ఎంచుకుంది. అలా వచ్చిన సినిమా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన పింక్. ఈ సినిమాతో తాప్సీకి హిందీ సీమలో మంచి క్రేజ్ వచ్చింది.
Also Read – Kiran Abbavaram: బ్రేక్ ఈవెన్ సాధించిన కే ర్యాంప్ – మిక్స్‌డ్ టాక్‌తో హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం
పింక్ తర్వాత ఈ బ్యూటీకి అక్కడ వరుసగా మంచి సినిమాలలో నటించే అవకాశాలు దక్కాయి. బద్లా, మన్మర్జియాన్, మిషన్ మంగళ్, తప్పడ్, రష్మీ కాకెట్, శభాష్ మిథు లాంటి సినిమాలు తాప్సీని తారా స్థాయికి తీసుకెళ్ళాయి. తెలుగు కంటే హిందీలో తాప్సీకి మంచి స్టార్ డం వచ్చింది. ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఎంచుకొని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. తెలుగు, హిందీ సినిమాలలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించింది.
అలాగే, నిర్మాతగానూ మారి తనే ప్రధాన పాత్రలో బ్లర్ లాంటి సినిమాలను నిర్మించింది. చెప్పాలంటే సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా బాగా చేస్తుంది. కానీ, ఉన్నట్టుంది సినిమాలకి గుడ్ బై అనే వార్త హల్ చల్ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. దీనిలో నిజమెంత ఉందనేది తాప్సీ స్వయంగా స్పందిస్తే గానీ తెలియదు. చూడాలి మరి దీనిపై తాప్సీ ఏమంటుందో.
Also Read – Nayanthara: నయనతారకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా?


