పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంలో ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షూరూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేశారు. ‘తార తార’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష సాహిత్యం అందించగా.. లిప్సిక, ఆదిత్య ఆలపించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.