Thursday, January 22, 2026
Homeచిత్ర ప్రభTamannaah: బ‌యోపిక్ మూవీలో త‌మ‌న్నా - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Tamannaah: బ‌యోపిక్ మూవీలో త‌మ‌న్నా – ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బంప‌రాఫ‌ర్ కొట్టేసింది. బ‌యోపిక్ మూవీలో ఛాన్స్ ద‌క్కించుకుంది. బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌క‌ నిర్మాత, న‌టుడు శాంతారామ్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెర‌కెక్కుతోంది. వి శాంతారామ్ పేరుతో రూపొందుతున్న‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. త‌మ‌న్నా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చీర‌క‌ట్టులో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో త‌మ‌న్నా క‌నిపిస్తోంది. ఆమె ముఖంపై సినిమాల‌కు వాడే లైటింగ్ ఫోక‌స్ క‌నిపిస్తోంది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పోస్ట‌ర్ చూస్తుంటే త‌మ‌న్నా అల‌నాటి హీరోయిన్ సంధ్య పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా త‌మ‌న్నా అభిమానుల‌తో పంచుకుంది.

- Advertisement -

వీ శాంతారామ్ మూవీలో టైటిల్ పాత్ర‌లో సిద్ధాంత్ చ‌తుర్వేది క‌నిపించ‌బోతున్నాడు. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ది రెబెల్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా అనే క్యాప్ష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Also Read – Rajinikanth: ‘నరసింహ’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న తలైవర్.. టైటిల్ ఫిక్స్?

ఈ బ‌యోపిక్ షూటింగ్ మొద‌లైన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. హిందీ చిత్ర‌సీమ‌కు ఆద్యుడిగా శాంతారామ్ నిలిచారు. సుదీర్ఘ సినీ జీవితంలో 90కిపైగా సినిమాలు నిర్మించారు శాంతారామ్‌. 55 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సినిమా రంగానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను ప‌ద్మ విభూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్మేతో పాటు ప‌లు అవార్డులు వ‌రించాయి.

కాగా గ‌త కొన్నాళ్లుగా తెలుగు, త‌మిళ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన త‌మ‌న్నా బాలీవుడ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోంది. ఈ ఏడాది ఓదెల 2 మిన‌హా తెలుగులో సినిమాలేవి చేయ‌లేదు. టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్ – అట్లీ మూవీలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు హిందీలో శాంతారామ్ బ‌యోపిక్‌తో పాటు మ‌రో మూడు సినిమాల్లో న‌టిస్తోంది.
ఈ బ‌యోపిక్‌తో మ‌ళ్లీ హిట్టు కొట్టి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని మిల్కీ బ్యూటీ ఆశ‌ప‌డుతోంది.

Also Read – Anil Ravipudi: మెగాస్టార్ కాబట్టే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు- అనిల్ రావిపూడి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News