Wednesday, June 25, 2025
Homeచిత్ర ప్రభSriram Drugs case: అతడి వల్లే డ్రగ్స్ అలవాటు: హీరో శ్రీరామ్

Sriram Drugs case: అతడి వల్లే డ్రగ్స్ అలవాటు: హీరో శ్రీరామ్

Sriram Drugs case update: డ్రగ్స్ కేసు తమిళనాడు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన హీరో శ్రీరామ్ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ లో పలు కీలక అంశాలు వెల్లడించాడు. తనకు అన్నాడీఎంకే నేత ప్రసాద్ రూ.10లక్షలు ఇవ్వాలని తెలిపాడు. ఆ డబ్బు అడిగిన ప్రతిసారి కొకైన్ ఇచ్చేవాడని.. అలా తనకు కూడా డ్రగ్స్ అలవాటు అయ్యానని చెప్పాడు. చివరకు అతడిని డబ్బులు అడగటం మానేసి డ్రగ్స్ కోసం అడుక్కునే స్థాయికి వచ్చానని వాపోయాడు. తనకు అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఉన్నాడని.. కొడుకు బాగోగులు చూసుకోవాల్సి ఉన్నందుకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు.

కాగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు డ్రగ్స్ తో పట్టుకున్నారు. దీంతో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో హీరో శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రసాద్ తెలిపాడు. దీంతో వెంటనే శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ అరెస్టులో కోలీవుడ్ పరిశ్రమలో కలకలం రేగింది. ప్రస్తుతం నుంగంబాకం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్రీరామ్ ను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబడుతున్నారు.

విచారణలో శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో మరో తమిళ నటుడు కృష్ణను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో కృష్ణ పరారీలో ఉన్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కృష్ణకు తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు యువ దర్శకులతో పాటు సంగీత దర్శకులతోనూ సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కృష్ణ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడో అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి కోలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News