Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభTarak in Bollywood: హృతిక్ రోషన్ తో జూ. ఎన్టీఆర్

Tarak in Bollywood: హృతిక్ రోషన్ తో జూ. ఎన్టీఆర్

యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్) స్పై యూనివర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మెరవనున్నారు.  వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి టాలీవుడ్ సూపర్ స్టార్ తారక్ స్క్రీన్ షేర్ చేయనున్నారు.  అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సాహసాలున్నాయి. నార్త్-సౌత్ లోని సూపర్ స్టార్స్ తో కలిసి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కాలు పెట్టనున్నారు.

- Advertisement -

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వార్ 2 6వ సినిమాగా రానుంది.  ఇప్పటేక స్పై యూనివర్స్ జోనర్ తో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 ఉండగా ఈ సెగ్మెంట్ లో వార్ 2 వచ్చి చేరిందన్నమాట. 

జూనియర్ ఉండటం వల్ల సౌత్ బాక్సాఫీస్ కోట్లు కొల్లగొట్టడం ఖాయమని, ఓవర్సీస్ లో కూడా తారక్ కున్న ఫాలోయింగ్ వల్ల మరింత మంచి బిజినెస్ చేస్తుందని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News