హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) 2023 ఫిబ్రవరి 18న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో తీవ్ర విషాదం నింపింది. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి అయితే తారకరత్నను ఎప్పుడూ తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవాళ తారకరత్న రెండో వర్దంతి కావడంతో అలేఖ్య రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
“నిన్ను విధి మా నుండి దూరం చేసిన ఈ రోజుని లోకంలో ఏదీ పూరించదు. నిన్ను కోల్పోయిన బాధ కాలం మాన్పలేని గాయం, భర్తీ చేయలేని హృదం. మనం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ నీ ఉనికి మా జీవితాల్లో ఉంటుంది. నిన్ను మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి మిస్ అవుతున్నాము” అని ఎమోషన్ అయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో ఉన్న ఫొటోలును షేర్ చేశారు.


