CM Revanth Dulquer Meets: మలయాళ సూపర్ స్టార్‌గా విశేష గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడం సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రత్యేక భేటీ జరిగింది. దుల్కర్‌తో పాటు ప్రముఖ సినీ నిర్మాత స్వప్న దత్ ఇతర ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్ ప్రాజెక్టులు, రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులలో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఆయన స్ట్రయిట్ మూవీస్ చేస్తున్నారు. ఇక్కడ అయనకు మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది. ‘మహానటి’ సినిమాతో తెలుగులో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దుల్కర్ తర్వాత ‘సీతారామం’ వంటి మరో విజయవంతమైన చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ‘లక్కీ భాస్కర్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు, దీని ద్వారా తెలుగులో ఆయనకు క్రేజ్ మరింత పెరిగింది.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రానాకు చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1950ల నాటి కాలక్రమాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read – Vishnu Manchu Next Movie: ఈ సారి పెద్ద ప్లాన్ వేసిన మంచు విష్ణు – పాన్ ఇండియన్ యాక్టర్స్‌తో రావణ!


