HomeTop StoriesSingle Screen: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధరలపై ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

Single Screen: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధరలపై ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

Telangana Exhibitors Association: తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను కాపాడుకోవాలని తెలిపిన ఎగ్జిబిటర్స్‌.. ఇకపై ఆ థియేటర్లలో ధరలు పెంచొద్దని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రభుత్వం జీవీ ఇచ్చినా తాము ధరలు పెంచబోమని స్పష్టం చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/meta-sensational-decision-on-layoffs/

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ ఈ రోజు సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సింగిల్‌ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలుపై చర్చించారు. ఐదు ప్రధాన అంశాలు ఎజెండాగా సమావేశంలో చర్చ జరిగింది.

సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్‌ సమయంలో టికెట్‌ ధరలు పెంచేందుకు చిత్ర బృందాలు జీవో తెచ్చుకుంటాయి. కానీ ఇకపై ప్రభుత్వం అలాంటి జీవోలు ఇచ్చినా ఇకపై సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరలు పెంచబోం. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న భరోసా. తెలంగాణ వ్యాప్తంగా అన్ని సింగిల్‌ స్క్రీన్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. పర్సంటేజీలో సినిమాలు ప్రదర్శిస్తేనే సింగిల్‌ స్క్రీన్లకు మనుగడ ఉంటుంది. అందుకే మేము నిర్మించిన చిత్రాలను పర్సంటేజీ షేరింగ్‌ విధానంలో ప్రదర్శించేందుకు అంగీకరిస్తాం. – నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శిరీష్‌

Also Read: https://teluguprabha.net/telangana/krishna-river-management-board-meeting-concludes/

ప్రస్తుతం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంటున్నాయి. నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిర్మాతలు తమను ఆదుకోవాలని.. పర్సంటేజీల విషయంలో వెనక్కి తగ్గాలని కోరడంతో.. అసోసియేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News