Telangana Exhibitors Meeting: థియేటర్లలో సినిమాల విడుదలలో పర్సంటేజీ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, నిర్మాతల మధ్య చర్చ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా “పర్సంటేజ్ షేరింగ్ విధానం” అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-cabinet-allotted-huge-funds-for-godavari-pushkaralu/
త్వరలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల కాకున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేన్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. తమకు ‘పెద్ది’ సినిమా కూడా పర్సంటేజ్ కావాలని.. అది ఎంతో నిర్మాతలు నిర్ణయించాలని కోరింది. పర్సంటేజ్ ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను తెలంగాణలో వేస్తామని స్పష్టం చేసింది. నిర్మాతలు కావాలనే తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపించారు.
‘మేము ‘పెద్ది’ లాంటి సినిమాలకు సెల్యూట్ చేస్తాం. దాని మీద మాకు పగ ఏమీ లేదు. ‘పెద్ది’ని ఈ గొడవ నుంచి మినహాయించాలని అనుకున్నాం. కానీ ఆ సినిమా తర్వాత కూడా మళ్లీ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారనేది అర్ధం కాకనే పెద్దిని కూడా పర్సంటేజ్ స్లాబ్‌లో చేర్చాలని నిర్ణయించుకున్నాం. అయినా పోనీ ‘పెద్ది’ వదిలేద్దాం అనుకున్నా వచ్చే పెద్ద సినిమాకే చేద్దాం అంటున్నారు. మూడు వారాల సమయం కోరుతున్నారు. అందుకే ఇక కరెక్ట్ కాదని ఈ సినిమాను కూడా పర్సంటేజ్ కే ఆడుతాం అని నిర్ణయం తీసుకున్నాం’ – తెలంగాణ ఎగ్జిబిటర్లు
Also Read: https://teluguprabha.net/cinema-news/puri-jagannadh-controversial-comments/
తమ థియేటర్లలో రెంట్ ట్రాక్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. తమ దగ్గర ఎక్కడా ఫ్రాడ్ జరగడం లేదని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. థియేటర్ల సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాకుండా.. అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి గ్రేడింగ్ చేయాలని కోరారు. అలాంటి గ్రేడింగ్‌కు మాత్రమే తాము సిద్ధమని వెల్లడించారు. అంతకు ముందు హరిహర వీరమల్లు సినిమా సమయంలో తమ డిమాండ్ చెబితే ఇబ్బంది అన్నారని వెనక్కి తగ్గామని.. తరువాత తమ డిమాండ్ వినిపిస్తూ వచ్చామన్నారు.

