Babu Mohan Visit TTD: సీనియర్ నటుడు బాబు మోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. స్వామి దర్శనం అనంతరం బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు. 41 సంవత్సరాలు తాను నటుడిగా కొనసాగతున్నానంటే అది వెంకటేశ్వర సామి దయవల్లే అని అన్నారు. ప్రస్తుతం తాను 15 సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలిపారు. అలాగే చాలా కాలం తర్వాత తిరుమలకు రావడం ఆ స్వామి ఆశీర్వాదమన్నారు.
15 సినిమాలు చేస్తున్నా..
‘గతంలో నా వల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందని తెలిసి స్వామిని దర్శించుకోవడం తగ్గించాను. కానీ, నిన్నటివరకు దగ్గరలోనే షూటింగ్ జరిగింది. అది పూర్తవ్వగానే స్వామిని దర్శించుకోవాలని అనుకున్నా. ఈ రోజు అది జరిగింది. ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాను. అవన్ని కూడా మంచి పాత్రలే. ఇప్పుడు డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నానను. అయితే అప్పటిలా ‘అన్నా..’ లాంటి పాత్రలు కావు ఇవి. నా చివరి శ్వాస వరకు నటిస్తూ, ప్రేక్షకులని నవ్వించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.

