Dancers Association: తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. ఈ వివాదం ముగిసిపోలేదని,తాజా ఉద్రిక్తతలకు దారి తీసిందని సమాచారం.ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేసిన ఫిర్యాదు మేరకు కార్మిక కమిషనర్ కార్యాలయంలో సోమవారం విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా సుమలత సమర్పించిన వినతి పత్రాన్ని కమిషనర్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే, ఈ కీలక సమావేశానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు వెలువడే వరకు అసోసియేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వారు ఒక లేఖను సమర్పించారు.
Also Read: Crop Holiday: క్రాప్ హాలీడే ప్రకటించిన కోనసీమ రైతులు
దీనిపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికలకు సంబంధించి రెండు కీలక ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదనగా, కేవలం కార్యదర్శి పదవికి మాత్రమే ఎన్నిక నిర్వహించాలని ఫెడరేషన్ సూచించింది.

