Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభAparna Malladi: తెలుగు దర్శకురాలు అపర్ణ మృతి

Aparna Malladi: తెలుగు దర్శకురాలు అపర్ణ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో(Tollywood) మరో విషాదం చోటుచేసుకుంది. నటి, రచయిత, నిర్మాత, దర్శకురాలు అపర్ణ మల్లాది(Aparna Malladi) క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 54 ఏళ్లు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన అపర్ణ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

- Advertisement -

కాగా ‘ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్’ అనే చిత్రంతో ఆమె సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ‘పోష్ పోరీస్’ అనే వెబ్ సిరీస్ చేశారు. రెండేళ్ల క్రితం ‘పెళ్లికూతురు’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డారు. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News