Friday, December 12, 2025
Homeచిత్ర ప్రభAndhra King Taluka: నన్ను ఆంధ్ర కింగ్‌ని చేసేశారు: ఉపేంద్ర

Andhra King Taluka: నన్ను ఆంధ్ర కింగ్‌ని చేసేశారు: ఉపేంద్ర

Upendra as Andhra King: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నాయకానాయికలుగా మహేశ్ బాబు పి. దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ సూర్య పాత్రలో నటించిన కన్నడ హీరో ఉపేంద్ర మాట్లాడుతూ, “ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయ్యాను. ఎమోషనల్‌గా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అని ఆలోచించాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. అది ఇక్కడ ఉన్నవాళ్ళ గొప్పతనం. నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. గత పాతిక ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా… ఇది నాప్లేస్ అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్‌లో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది” అని అన్నారు.

- Advertisement -

డైరెక్టర్ మహేష్ బాబు పి. మాట్లాడుతూ, “సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. చిన్నచిన్న డీటెయిల్స్ కూడా పరిశీలించి.. వాటి గురించి ప్రేక్షకులు చెబుతుంటే ఆనందంగా అనిపించింది. రామ్, ఉపేంద్ర తమ నటన, పాత్రలతో మ్యాజిక్ చేశారు. ఒక మంచి టీంతో ప్రయాణం చేసినప్పుడు వండర్స్ జరుగుతాయి. మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్‌లతో నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను” అని అన్నారు.

Also Read: Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – బాక్సాఫీస్ వ‌ద్ద రామ్ మాస్‌ ర్యాంపేజ్‌

నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ, “ఇది కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు ఫ్యామిలీస్, పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే కథ. ఇందులో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ షో గ్రాడ్యువల్‌గా పెరుగుతూనే వెళుతోంది. శుక్రవారం మార్నింగ్ నుంచి అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా. రామ్ యూఎస్‌లో సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. రామ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా కోసం టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.కె.ఎన్., మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News