Mastis OTT: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో డైరెక్టర్ క్రిష్ రూపొందించిన ఘాటి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి.
తెలుగు రొమాంటిక్ మూవీ…
ఇదిలా ఉండగా డైరెక్టర్ క్రిష్ కథను అందించిన తెలుగు రొమాంటిక్ మూవీ మస్తీస్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మస్తీస్ సినిమాలో నవదీప్, చాందిని చౌదరి, హెబ్బా పటేల్, బిందు మాధవి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అజయ్ భూయాన్ దర్శకత్వం వహించాడు.
వెబ్‌సిరీస్…సినిమాగా రిలీజ్…
వాస్తవానికి ఇదొక వెబ్‌సిరీస్. 2020లో మస్తీస్ అనే టైటిల్‌తోనే ఆహా ఓటీటీలో ఈ సిరీస్ రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్‌ను ట్రిమ్ చేసి రెండు గంటల పన్నెండు నిమిషాల రన్‌టైమ్‌తో సినిమాగా రిలీజ్ చేశారు. మస్తీస్ వెబ్‌సిరీస్‌కు క్రిష్ కథను అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరించారు.
లిప్‌లాక్‌లు ఎక్కువే…
మోడ్రన్ రిలేషన్స్‌ను బోల్డ్‌గా ఆవిష్కరిస్తూ మస్తీస్ కథను రాశారు క్రిష్. లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్స్‌తో పాటు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఈ సిరీస్‌లో చాలానే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. క్రిష్ ఇలాంటి బూతు సిరీస్ చేయడమేంటి అంటూ విమర్శలు గుప్పించారు. సినిమాలో మాత్రం ఆ బూతులు, ఇంటిమేట్ సీన్స్‌ను చాలా వరకు కట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
మస్తీస్ కథ ఇదే…
ప్రణవ్ (నవదీప్), గౌరీ (బిందుమాధవి) భార్యభర్తలు. మస్తీస్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తుంటారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న వారి మధ్య అనుకోకుండా మనస్పర్థలు వస్తాయి. మస్తీస్ రెస్టారెంట్‌లోనే వెయిటర్‌గా పనిచేసే లేఖను (చాందిని చౌదరిని) మేనేజర్ (రాజా చెంబోలు) ఇష్టపడతాడు. మరోవైపు అదే రెస్టారెంట్‌లోని మ్యూజిక్ బాండ్‌లో సింగర్‌గా వర్క్ చేస్తుంటుంది తాన్యా (హెబ్బాపటేల్). లవర్‌కు బ్రేకప్ చెబుతుంది. కానీ ఆ మాజీ ప్రియుడు కూడా అదే బ్యాండ్‌లో పనిచేస్తుంటాడు. రెస్టారెంట్‌తో ముడిపడిన ఈ మూడు జంటల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? వారి సమస్యలకు పరిష్కారాలు కూడా అక్కడే దొరికాయా? అన్నదే మస్తీస్ మూవీ కథ. మస్తీస్ మూవీకి స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు.
Also Read- kiara advani: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ జననం!
కన్యాశుల్కం…
ప్రస్తుతం ఘాటి మూవీతో పాటు కన్యాశుల్కం పేరుతో మరో వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నాడు క్రిష్. ఈ వెబ్‌సిరీస్‌కు కూడా కథను అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు క్రిష్. కన్యాశుల్కం సిరీస్‌లో అంజలి, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


