ఈరోజు ఎపిసోడ్‌లో మీనా మనోజ్‌కి తన భార్య నీళ్లు పెట్టదా అని ఎదురు సమాధానం చెప్తే ప్రభావతి నేను చెప్తే చేయవా అని అరుస్తుంది. అప్పుడు బాలు ఎందుకు చేయాలి, ఓ ఆర్డర్లు వేస్తున్నారు తనే ఎందుకు చేయాలి అని అడుగుతాడు. నాకు అందరూ పనులు చెప్తున్నారు అని మీ ఆయనతో చెప్తున్నావా అంటుంది. మీనా మీకు ఏ పని చేయదు ఎవరిది వాళ్లు చేసుకోండి అంటాడు బాలు. రోహిణికి కావాలంటే ఇస్తాను కానీ ఈయనికి ఇవ్వను అని సమాధానం చెప్తేస్తుంది. రోహిణి డ్యూటీకి వెళ్తుంది అంటే మొహానికి పౌడర్లు కొట్టడం కుడా డ్యూటీ ఆ అంటాడు బాలు. మనోజ్ నాకు ఏ వేడి నీళ్లు వద్దు నేను చలి నీళ్లతోనే చేస్తాను అంటాడు. చలి నీళ్లు స్నానం చేస్తానన్న మనోజ్ బకెట్‌లో బాలు వేడి నీళ్లు పోసేస్తాడు.
అవి చూసుకోకుండా మనోజ్ ఒంటిమీద వేసుకుని ఒళ్లు కాల్చుకుంటాడు. మనోజ్ అరుపులకు ఇంట్లో వాళ్లంతా బెదిరిపోయి అక్కడికి వస్తారు. బకెట్‌లో వేడి నీళ్లు ఉన్నాయి చూసుకోకుండా వేసుకున్నాను ఒళ్లు కాలింది అని మనోజ్ చెప్తాడు. అందులో వేడి నీళ్లు ఎవరు పెట్టారు అని ప్రభావతి మీనా మీద అరుస్తుంటే ఈలోగా అక్కడికి బాలు వచ్చి ఈ నీళ్లు నేనే పోసాను అని చెప్తాడు. వేడి నీళ్లు కావాలన్నాడని పెట్టాను చూసుకుని వేసుకోవాలిగా అని అంటాడు బాలు. పాపం మనోజ్ తింగరోడిలా తమ్ముడితో మాటలు పడతాడు. ఇందాక మీనాకి ఏంటి పార్లరమ్మా అల్లం టీ అడుగుతున్నావు నా భార్యని ఇంకోసారి మీనాకి చెప్తే అందరికీ ఇలానే ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు.
తర్వాత ఇంటికి వచ్చిన సత్యంకు జరిగిందంతా చెప్తుంది ప్రభావతి. బాలు, ప్రభావతి ఇద్దరూ మాటల యుద్ధం చేసుకుంటారు మధ్యలో సత్యం నచ్చచెప్తాడు. బాలు, మీనా వల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి నా ఓపిక నశించిపోయింది ఇలా ఉంటే ఇక నా వల్ల కాదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మీరు ఒప్పుకోవాలి అని బాలు, మీనాని వేరే కాపురం పెట్టిద్దాం అని ప్రభావతి అంటుంది. మీరు ఎప్పుడు ఇలా హాల్‌లో పడుకోలేదు, నేను మా నాన్న ఇచ్చిన ఇంట్లో గది లేకుండా ఉంటున్నా దీనికి ఇదే పరిష్కారం ఒప్పుకోండి అంటుంది. అందరికీ మంచి జరుగుతుందనే ఇలా చేస్తున్నాను అంటే సత్యం ఏమో ఆలోచించి నిర్ణయం చెప్తానని అంటాడు. దానికి ప్రభావతి సంబరపడిపోతుంది. మరోవైపు శృతి ఫోన్ సిగ్నల్ కోసం ఇళ్లంతా తిరుగుతుంది. నేను జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకోవాలి ఇక్కడ సిగ్నల్ లేదు ఎలా అంటే మీనా చేస్తుంది ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా పళ్లు ఉన్నాయి అంటుంది. శృతి ఏమో మీరు చేయచ్చు కదా అన్నీ మీనాకి చెప్తారు ఏంటి అంటుంది. మీనా శృతి కోసం జ్యూస్ చేసి ఇద్దామని వెళ్తుంటే ఈ లోపు బాలు వచ్చి ఆపుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.