Saturday, February 15, 2025
Homeచిత్ర ప్రభTFCC president Bharat Bhushan met CM Revanth: సీఎం రేవంత్ తో తెలుగు...

TFCC president Bharat Bhushan met CM Revanth: సీఎం రేవంత్ తో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భేటీ

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అధ్యక్షుడు భరత్ భూషణ్

- Advertisement -

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు, గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ : ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ : తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News