Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభThaman: అంధ గాయకుడికి అవకాశమిచ్చిన థమన్.. కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్

Thaman: అంధ గాయకుడికి అవకాశమిచ్చిన థమన్.. కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్

Thaman| రాజు అనే అంధ గాయకుడు బస్సులో వెళ్తూ పాట పాడిన వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ యువకుడి వీడియోను షేర్ చేశారు. “మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భు తంగా పాడారు కదా.. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్‌” అని సజ్జనార్‌ కోరారు. ఆయన పోస్టుకు మరో సంగీత దర్శకుడు థమన్ స్పందించారు. అతడు కచ్చితంగా ఇండియన్‌ ఐడల్‌లో పాడతాడని హామీ ఇచ్చారు.

- Advertisement -

“ఈ అబ్బాయ్‌ కచ్చితంగా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4లో (Indian Idol) పాడతాడు. అతడికి గొప్ప టాలెంట్‌ ఉంది. ఆ వేదికపై అతడితో కలిసి నేను ప్రదర్శన ఇస్తాను. శ్రుతిలో ఎంత స్పష్టంగా పాడుతున్నాడో.. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయితేనేం.. అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా” అని థమన్ తెలిపారు.

తాజాగా థమన్ పోస్టుపై సజ్జనార్ స్పందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. “అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు థమన్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ అవ‌కాశంతో అద్భుత‌మైన త‌న టాలెంట్‌కు మ‌రింత‌గా గుర్తింపు ద‌క్కుతుంది. భవిష్యత్ లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదుగుతార‌ని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News