Theri: సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సమంత తమిళ సినిమా వాయిదాపడింది. దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడింది. ఈ వివాదం రోజుకో మలుపులు తిరుగుతూ ప్రస్తుతం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. జననాయగన్ వాయిదా పడటంతో విజయ్ అభిమానులు డిసపాయింట్ అయ్యారు. దాంతో జననాయగన్ స్థానంలో తేరి సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కోలీవుడ్ ప్రొడ్యూసన్ కలైపులి థాను ఇటీవల ప్రకటించారు. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. పోస్టర్లను విడుదలను చేశారు.
జననాయగన్ బాటలోనే తేరీ కూడా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా ప్రకటించారు. రాబోవు కొత్త సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఆయా సినిమాల నిర్మాతల సూచనల మేరకు తేరీని వాయిదా వేస్తున్నామని కలైపులి థాను ట్వీట్ చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ సీబీఐ విచారణను ఎదుర్కోవడం, జననాయగన్ కోర్టు వివాదం కూడా తేరీ మూవీ రీ రిలీజ్ వాయిదాకు మరో కారణమని ప్రచారం జరుగుతోంది.
Also Read – Sreeleela: టాలీవుడ్ డైరెక్టర్లపై శ్రీలీల సెటైర్లు – అంత మాట అనేసిందా?
తేరీ మూవీకి అట్లీ దర్శకత్వం వహించాడు. సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ 150 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది. విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. తేరీ మూవీ తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయ్యింది.
తేరీ మూవీని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్.. తేరీ ఆధారంగానే రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. జననాయగన్ రిలీజ్ ఎప్పుడన్నది సస్పెన్స్‌గా మారింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవడంతో సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం చేరుకుంది.
Also Read – Yellamma Movie: దిల్ రాజు – బలగం వేణు సినిమా అప్‌డేట్ వచ్చేసింది..

