Akhanda 2 – OG: ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ హవా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలు అనగానే మ్యూజిక్ డైరెక్టర్‌గా మొదట తమన్ పేరు వినిపిస్తోంది. తెలుగులో ఐదు సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది జాట్‌తో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ బిజీ షెడ్యూల్స్ కారణంగా తమన్ ఒప్పుకున్న సినిమాలకంటే తప్పుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే రూమర్ కూడా వినిపిస్తోంది.
ఓజీ వర్సెస్ అఖండ 2
ఇదిలా ఉండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్న బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అఖండ 2 డివోషనల్ టచ్‌తో సాగే యాక్షన్ మూవీ కాగా…ఓజీ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. రెండు డిఫరెంట్ జానర్స్‌తో కూడిన సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఛాలెంజ్…
పవన్ కళ్యాణ్…బాలకృష్ణ…ఇద్దరు టాలీవుడ్‌లో గట్టి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల కావడంతో ఈ రెండు సినిమాలు తమన్‌కు ఛాలెంజింగ్‌గా మారినట్లుచెబుతోన్నారు. అభిమానులను సాటిస్‌ఫై చేసేలా మ్యూజిక్ విషయంలో రెండు సినిమాలకు మ్యాచ్ చేయడం అంటే ఒక రకంగా కత్తి మీద సామే. మరి ఈ మ్యూజిక్ టెస్ట్‌లో తమన్ పాస్ అవుతాడా? నందమూరి తమన్ ది పై చేయి అవుతుందా?…మెగా తమన్ గెలుస్తాడా? అన్నది క్యూరియాసిటీని కలిగిస్తోంది.
అదే జోష్…హ్యాట్రిక్ మూవీ…
అఖండ మూవీకి తన మ్యూజిక్‌తోనే ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించాడు పవన్. తమన్ మ్యూజిక్‌కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అదే జోష్‌ను అఖండ 2తో అందించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించాడు. భీమ్లానాయక్ కొంత పర్వాలేదనిపించిన వకీల్‌సాబ్ మ్యూజిక్ విషయంలో తమన్‌కు మెగా అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు ఓజీతో గట్టిగానే సమాధానం ఇవ్వాలని తమన్ ఎదురుచూస్తోన్నట్లు సమాచారం. ఓజీ, అఖండ 2, ప్రభాస్ రాజాసాబ్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసుకదాతో పాటు మరో రెండు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్.