Nithiin Thammudu: నితిన్ హిట్టు అనే మాట విని ఐదేళ్లు దాటిపోయింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత నితిన్ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్
వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన గత సినిమా రాబిన్‌హుడ్ సైతం డిజాస్టర్‌గా నిలిచి నితిన్‌కు నిరాశనే మిగిల్చింది. బడ్జెట్‌లో సగం కూడా
రికవరీ సాధించలేక పోయిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
తమ్ముడుపైనే ఆశలన్నీ…
ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ తమ్ముడుపైనే ఉన్నాయి. నితిన్ కెరీర్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో అగ్రెసివ్‌గా పాల్గొన్న
నితిన్ తమ్ముడు ప్రమోషన్స్‌లో మాత్రం కాస్త డల్‌గానే కనిపిస్తున్నారు. ఈ సారి తాను ఎక్కువగా మాట్లాడనని, సినిమానే మాట్లాడుతుందని నమ్మకంగా
చెబుతూ వస్తున్నారు.
ఎమ్‌సీఏ సీక్వెల్…
అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ఫాంటసీ యాక్షన్ అంశాలు జోడించి వకీల్‌సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఈ సినిమాను తెరకెక్కించారు. ఎమ్‌సీఏ సీక్వెల్ లాంటి
మూవీ ఇదని ప్రమోషన్స్‌లో నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నాడు. దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని, అనుకున్నదానికంటే ఎక్కువే బడ్జెట్
అయినట్లు చెప్పాడు.
25 కోట్లు…
గత కొన్నాళ్లుగా దిల్‌రాజు జడ్జిమెంట్ గురి తప్పుతూ రావడం, నితిన్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌ల ఎఫెక్ట్ తమ్ముడు ప్రీ రిలీజ్ బిజినెస్‌పై గట్టిగానే పడ్డట్లు తెలుస్తోంది.
వరల్డ్ వైడ్‌గా తమ్ముడు ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. నైజాంతో పాటు మరికొన్ని ఏరియాలలో నిర్మాత దిల్‌రాజు సొంతంగా ఈ
మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
పొంతనే లేదు…
నితిన్ గత మూవీ రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 28 కోట్ల వరకు జరిగింది. 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా రిలీజైంది. రాబిన్‌హుడ్‌తో పోలిస్తే
తమ్ముడు థియేట్రికల్ బిజినెస్ మూడు కోట్ల వరకు తక్కువే జరగడం గమనార్హం. ప్రమోషన్స్‌లో దిల్‌రాజు చెప్పిన బడ్జెట్‌కు సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు
పొంతనే లేకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరోవైపు సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడం కూడా ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని
అంటున్నారు. హింస, రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంత వరకు థియేటర్లకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమ్ముడు
మూవీలో కాంతర ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ తమ్ముడు మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. లయ, వర్ష బొల్లమ్మ,
స్వాసిక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.