Thammudu Movie: నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలైంది. దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీకి వకీల్‌సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. భారీ ప్రమోషన్స్‌తో తమ్ముడు మూవీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అందుకు తగ్గట్లే టీజర్స్, ట్రైలర్స్ కొత్తగా ఉండటంతో ఈ సారి నితిన్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఆడియెన్స్ భావించారు. తమ్ముడు.. నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టే మూవీగా నిలుస్తుందని దిల్‌రాజు కూడా నమ్మకంగా చెబుతూ వచ్చారు. కానీ మేకర్స్ ఊహించింది ఒకటి అయితే.. ఫస్ట్ డే రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది.
నెగెటివ్ టాక్…
ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచే తమ్ముడు సినిమాకు నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. ఔట్‌డేటెడ్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ మిస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తమ్ముడు మూవీని హీరో నాని రిజెక్ట్ చేసి మంచి పనిచేశాడని ట్వీట్స్ పెడుతోన్నారు. ఈ సినిమా రిజల్ట్‌ను నాని ముందుగానే ఊహించాడని, అందుకే రిజెక్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. తమ్ముడు విషయంలో నాని జడ్జ్‌మెంట్ కరెక్ట్ కాగా.. దిల్‌రాజు అంచనాలు మాత్రం తప్పాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఎమ్‌సీఏ సీక్వెల్…
తమ్ముడు మూవీ కథను హీరో నానిని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేయించినట్లు ప్రమోషన్స్‌లో దిల్‌రాజు చెప్పాడు. ఎమ్‌సీఏకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించాలని అనుకున్నామని, కానీ అనివార్య కారణాల వల్ల నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడని దిల్‌రాజు అన్నాడు. నాని చేయనని చెప్పడంతో అతడి స్థానంలో నితిన్‌ను హీరోగా తీసుకొని దిల్‌రాజు సినిమాను పూర్తిచేశాడు.
బడ్జెట్ ఎక్కువే…
తమ్ముడు మూవీకి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చుచేశామని దిల్‌రాజు అన్నారు. కేవలం మేకింగ్ కోసమే 35 కోట్ల వరకు పెట్టినట్లు, రెమ్యూనరేషన్స్, ప్రమోషన్స్‌తో కలిపి 75 కోట్లు దాటినట్లు చెప్పాడు. ఫస్ట్ డే టాక్‌ను బట్టి చూస్తే తమ్ముడు మూవీ దిల్‌రాజు గట్టిగానే షాకిచ్చే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.