Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభUnstoppable Season 2 : బాలయ్య షోలో బాహుబలి

Unstoppable Season 2 : బాలయ్య షోలో బాహుబలి

Unstoppable Season 2 : నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాప‌బుల్’. విజ‌య‌వంతంగా తొలి సీజ‌న్‌ను పూర్తి చేసుకుని రెండో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. ఇప్ప‌టికే ప్ర‌సారమైన ప‌లు ఎపిసోడ్‌లు అభిమానుల‌ను అల‌రించాయి. ఇక గ‌త కొంత‌కాలంగా బాల‌య్య షోలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సంద‌డి చేయ‌బోతున్నాడు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇన్ని రోజులు వీటిపై మౌనం వ‌హించిన ఆహా సంస్థ ఎట్ట‌కేల‌కు స్పందించింది. ఇది నిజ‌మేనంటూ అభిమానుల‌కు పండుగ లాంటి వార్త‌ను చెప్పింది. త్వ‌ర‌లోనే బాహుబ‌లి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ఓ వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో ప్ర‌భాస్‌, బాల‌య్య న‌టించిన సినిమాల్లోని మాస్ స‌న్నివేశాల‌ను మిక్స్ చేసేలా ప్రోమోను క‌ట్ చేశారు. ఈ ప్రొమో చాలా బాగుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ షోకి ప్ర‌భాస్‌తో పాటు గోపిచంద్‌ రానున్నట్లు తెలుస్తోంది. మ‌రీ బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు ప్ర‌భాస్‌ని అడుగుతాడో వాటికి బాహుబ‌లి ఏం స‌మాధానాలు చెబుతాడోన‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఆదివారం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ ఎపిసోడ్‌ను క్రిస్మ‌క్ కానుక‌గా ప్ర‌సారం చేసేందుకు షో నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

‘వ‌ర్షం’ చిత్రంలో ప్ర‌భాస్‌, గోపిచంద్ క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం కొన‌సాగుతోంది. గోపిచంద్‌ పలు ఇంటర్వూలలో ప్రభాస్ తనకు బెస్ట్‌ ఫ్రెండ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి బాల‌య్య షోకి వ‌స్తుండ‌డంతో ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌ని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News