Alias Rukmini: ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన సమర్పణలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరంగా దీనిని మలుస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు.
ఈ గ్లింప్స్‌లో రుక్మిణి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. ఆమెను విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కోపంగా బోర్డుపై తన పేరు రాస్తూ, ఆ తర్వాత విద్యార్థుల వైపు ఇంటెన్స్ గా చూసే రుక్మిణి పాత్రను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది. కమాండింగ్, ఆరోగెంట్ బిహేవియర్ రుక్మిణి పాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందంగా కనిపిస్తూనే, ఆరోగెన్స్ తో కూడిన రుక్మిణి పాత్రకు ఆఫియా సయ్యద్ చక్కగా సరిపోయారు. ఈ గ్లింప్స్‌లో ఆమె లుక్, అభినయం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రేమకథా అంశాలతో పాటు ఆసక్తికరమైన ప్రధాన సంఘర్షణతో కూడిన కథలో నితిన్‌ను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ డీవోపీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా సృజన అడుసుమిల్లి ఎడిటర్.

