Homeచిత్ర ప్రభSampoornesh Babu: ‘ది ప్యారడైజ్’లో బిర్యానీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది.. సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’లో బిర్యానీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది.. సంపూర్ణేష్ బాబు

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమా పట్ల అంచనాలను భారీగా పెంచాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు పాత్రికేయులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలేమిటో ఆయన మాటల్లో…

- Advertisement -

“ది ప్యారడైజ్ సినిమాలో క్యారెక్టర్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ దగ్గర నుంచి కాల్ రాగానే…ఆయనను వెళ్లి కలిశాను. అందులో బిర్యాని క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా సీరియస్ గా ఉంటుంది. గతంలో నేను చేసిన అన్ని పాత్రలకు భిన్నంగా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇందులో నానికి బెస్ట్ ఫ్రెండ్ గా, సినిమా త్రూ అవుట్ కనిపించే క్యారెక్టర్ నాది.

మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే…

మూడు సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ జరిగేవికావు. నాని అన్న, డైరెక్టర్ శ్రీకాంత్ తో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఇంత పెద్ద సినిమా ఎప్పుడూ చేయలేదు. నా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నా వంతు కృషి చేశాను. నాని నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. షూటింగ్ సెట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఏదైనా చక్కగా పర్ఫార్మ్ చేస్తే మెచ్చుకునేవారు. నేను మోహన్ బాబుతో నటించడానికి చాలాకాలం ఎదురు చూశాను. ఇందులో మా కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పటినుంచో ఉన్న కల నెరవేరినట్టుగా అనిపించింది.

పాత్ర కోసం బరువు తగ్గాను..

ఈ పాత్ర కోసం బరువు తగ్గమని చెప్పారు. తగ్గాను. అలాగే జట్టు గడ్డం కూడా పెంచాను. డైరెక్టర్ ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా వుంటుందో సినిమా అంత అద్భుతంగా వుంటుంది. అంతకంటే అద్భుతంగా నా క్యారెక్టర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మీరు సెప్టెంబర్ 24న చూస్తారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఏ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఇంకే సినిమాలోనూ నటించలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News