ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్‌కో’ విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్‌ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు. గుంటూరులోని వివిఐటి కాలేజీలో ఈ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్‌గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ఈ పాట ఆ క్రేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ చిత్రం పట్ల అంచనాలను పెంచుతోంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Epic: ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మ్యూజికల్ జర్నీ అదుర్స్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

