Thursday, July 17, 2025
Homeచిత్ర ప్రభThe Paradise: గూస్ బంప్స్.. 'ది ప్యారడైజ్' గ్లింప్స్

The Paradise: గూస్ బంప్స్.. ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్

నేచుర‌ల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. హిట్3తో పాటు తనకు ‘దసరా’ వంటి బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ గ్లింప్స్(The Paradise Glimpse) విడుదలచేశారు. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో నాని లుక్ అదిరిపోయింది. గతంలో ఎన్నడూ నటించని పాత్రలో నటిస్తున్నట్లు చూపించారు. ఇక 2026 మార్చి 26న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

ఇక భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అదిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్ భాష‌ల్లోఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News