Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభThe Raja saab: రాజా సాబ్ హంగామా.. ‘సహన సహన’ సాంగ్ ప్రోమో రేపే!

The Raja saab: రాజా సాబ్ హంగామా.. ‘సహన సహన’ సాంగ్ ప్రోమో రేపే!

Sahana Sahana Song: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండగే పండగ! డిసెంబర్ నెల నుంచే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో ‘ది రాజా సాబ్’ మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను పీక్స్‌లో స్టార్ట్ చేయబోతుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘పాన్ ఇండియా నెంబర్ వన్’ సాంగ్ ఆల్రెడీ చార్ట్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ట్రైలర్ టైంలో వచ్చిన చిన్నపాటి ట్రోల్స్‌ను కూడా ఈ మాస్ సాంగ్‌తో డైరెక్టర్ మారుతి సింగిల్ షాట్‌లో క్లియర్ చేసేశారు.

- Advertisement -

ALSO READ: Balayya: పవన్ కోసం తన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్న బాలయ్య!

ప్రభాస్ ఫ్యాన్స్ దశాబ్దాలుగా చూడాలనుకుంటున్న క్లాసిక్ లుక్స్‌ను ఈ సినిమాలో మారుతి పర్ఫెక్ట్‌గా రీక్రియేట్ చేశారు. ఆ లుక్స్ చూసిన ఫ్యాన్స్ “మున్నా, డార్లింగ్ వైబ్స్” వచ్చాయంటూ ఫుల్ ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, గ్రేస్ తెరపై చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఆ పాన్ ఇండియా సాంగ్ క్రియేట్ చేసిన హైప్ ఇంకా తగ్గనే లేదు.

ALSO READ: Mowgli Movie Review: మోగ్లీ రివ్యూ.. విలన్ స్ట్రాంగ్, కథ వీక్!

ఇప్పుడిక అసలైన మ్యూజికల్ ట్రీట్ రాబోతోంది! మూవీ టీమ్ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ పాట పేరు ‘సహన సహన’. టైటిల్ వింటుంటేనే, ఇది ఒక ప్యూర్, డెలిషియస్ మెలోడీగా ఉంటుందని అర్థమవుతోంది. అందుకే ఫస్ట్ సాంగ్ మాస్ హైప్‌ను మించి, ఈ ‘సహన సహన’ సాంగ్ మ్యూజికల్ చార్ట్‌లను డామినేట్ చేస్తుందని ఆడియన్స్‌లో విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.
ఈ క్రేజీ వెయిటింగ్‌కు బ్రేక్ ఇస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా సోషల్ మీడియాలో బిగ్ అప్‌డేట్ రివీల్ చేసాడు. ‘సహన సహన’ సాంగ్ ప్రోమో రేపు (డిసెంబర్ 14) సాయంత్రంలోపు రిలీజ్ కానుందని ఆయన పోస్ట్ చేశాడు. రేపు రాబోయే ఈ మెలోడీ ప్రోమోతో ‘ది రాజా సాబ్’ మ్యూజికల్ జర్నీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం పక్కా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News