sahana Sahana song promo: రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న రొమాంటిక్ వైబ్ మళ్లీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. దర్శకుడు మారుతితో కలిసి చేస్తున్న ‘ది రాజా సాబ్’ ఈ హారర్ కామెడీ మూవీపై ఉన్న అంచనాలు ఇప్పుడు పీక్స్‌కు చేరాయి. సంక్రాంతి ఫెస్టివల్ బరిలోకి దిగుతున్న ఈ పాన్ ఇండియా స్మాషర్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ రిలీజ్ చేసిన రెండవ సింగిల్ ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో ఇంటర్నెట్‌ను బ్లాస్ట్ చేస్తోంది. ముగ్గురు హీరోయిన్లు (నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్) ఉండటం సినిమాకు నెవర్ బిఫోర్ అట్రాక్షన్.
ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ తో ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ హంగామా చూడగా, ఇప్పుడు ‘సహానా సహానా’ తో అంతా ఫుల్ మెలోడీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తమన్ స్వరపరిచిన ఈ పాట ప్యూర్ సోల్‌ఫుల్ ట్యూన్గా, ఇయర్‌బడ్స్‌లో రిపీట్ మోడ్‌లో ఉండేలా ఉంది. కృష్ణకాంత్ కేకే అందించిన బ్యూటిఫుల్ లిరిక్స్, ప్రభాస్, నిధి అగర్వాల్ కెమిస్ట్రీతో కలిసి ఈ పాటను ఇన్‌స్టెంట్ హిట్‌గా మార్చాయి.
ఈ పాటను స్పెయిన్‌లోని విజువల్లీ స్టన్నింగ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. ప్రోమోలో ప్రభాస్ తనదైన ‘డార్లింగ్’ స్టైల్లో, చార్మింగ్ రొమాంటిక్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను మైమరిపిస్తున్నాడు. ఆయన రొమాంటిక్ అప్పీల్ చూసి, ‘డార్లింగ్’ ఎరా నాస్టాల్జియాను రీకాల్ చేసుకుంటున్నారు. హారర్ కామెడీ అయినప్పటికీ, ఇంత బలమైన లవ్ యాంగిల్ ఉండటం.. ఈ సినిమా మల్టీప్లెక్స్‌లతో పాటు మాస్ సెంటర్స్లోనూ హిట్టవడం పక్కా అని చెప్తోంది.
ALSO READ: Venkatesh: న్యూ ఇయర్‌కు వింటేజ్ మ్యాజిక్.. ‘నువ్వు నాకు నచ్చావ్’ 4K రీ రిలీజ్!
‘సహానా సహానా’ పూర్తి సాంగ్‌ను డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తమన్ మ్యూజిక్, ప్రభాస్ రొమాంటిక్ ప్రెజెన్స్ కలగలిపి ఈ పాటను ట్రెండింగ్ చార్ట్‌బస్టర్‌గా మారుస్తాయి అనడంలో సందేహం లేదు. సంక్రాంతి బరిలో ‘ది రాజా సాబ్’ తన ప్రమోషన్స్‌తో ఇప్పటికే రచ్చ స్టార్ట్ చేశాడు!

