Friday, January 16, 2026
HomeTop StoriesRaja Sab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ప్రీమియర్‌ షో రివ్యూ వచ్చేసింది.. "ది రాజాసాబ్‌" ఎలా...

Raja Sab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ప్రీమియర్‌ షో రివ్యూ వచ్చేసింది.. “ది రాజాసాబ్‌” ఎలా ఉందంటే?

The Raja Sab Twitter Review: యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత నటించిన లేటెస్ట్ పాన్-ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈరోజు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. నిన్న అర్ధరాత్రి నుంచే ఏపీలో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు. అయితే, తెలంగాణలో మాత్రం ప్రీమియర్‌ షోలు వేయలేదు. సంక్రాంతి సందర్బంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. హారర్‌ ఫాంటసీతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం మూడు గంటలకు పైగా రన్‌టైమ్‌తో థియేటర్లలో అలరించే ప్రయత్నం చేసింది.

- Advertisement -

సినిమా కథ విషయానికి వస్తే.. రాజ కుటుంబానికి చెందిన రాజాసాబ్ (ప్రభాస్).. తన నానమ్మతో సాధారణ జీవితం గడుపుతూ, కుటుంబ రాజభవనంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. రాజభవనంలో దాగి ఉన్న రహస్యం చుట్టూ సినిమా సాగుతుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, ఫాంటసీ, యాక్షన్ మిశ్రమంగా ఉంటుంది. ట్రైలర్‌లో కనిపించినట్లుగా ప్రభాస్ వింటేజ్ లుక్‌, సంజయ్ దత్ భయానక ఎంట్రీ, రిచ్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక, రిలీజ్ రోజు నుంచే ప్రీమియర్ షోల నుంచి ట్విట్టర్ (X)పై రివ్యూలు వెలువడుతున్నాయి. నెటిజన్లు మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తుంటే, న్యూట్రల్ ప్రేక్షకులు మాత్రం నెగెటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు. అయితే, ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించిందనీ, సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ ఎనర్జీ, యాక్షన్, హాస్పిటల్ సీక్వెన్స్, క్లైమాక్స్ హైలైట్స్‌గా నిలిచాయని చాలామంది ట్విట్టర్‌ రివ్యూల్లో చెబుతున్నారు.

ట్విట్టర్‌లో మిక్స్‌డ్‌ టాక్‌.. నెగెటివ్‌ రివ్యూలు..

“ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినిమాను క్యారీ చేసింది. సెకండ్ హాఫ్ సూపర్‌గా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.” అని ఫ్యాన్స్ పోస్టులు తెగ వైరలవుతున్నాయి. కొందరు 3.5/5, 4/5 రేటింగ్ ఇస్తూ “సంక్రాంతికి ఫెస్టివల్ మూవీగా నిలుస్తుంది. మూవీని కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేశాం. కిడ్స్‌ లవ్ ఇట్” అంటున్నారు. అయితే, ఫ్యాన్స్‌ ఇలా కుషీ అవుతుండగా.. కొంతమంది మాత్రం నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. “ఫస్ట్ హాఫ్ బోరింగ్, స్క్రీన్‌ప్లే వీక్, వీఎఫ్‌ఎక్స్ ఇన్‌కన్సిస్టెంట్, కామెడీ ఫోర్స్‌డ్” అని కొందరు చెబుతున్నారు. “ప్రభాస్ ఓవరాక్టింగ్, స్టోరీ డ్రాగ్ అయింది, 2/5 రేటింగ్‌ మాత్రమే” అని నెగెటివ్‌ పోస్టులు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా హిందీ యూట్యూబర్లు, నార్త్ ఇండియా రివ్యూయర్ల నుంచి నెగెటివిటీ ఎక్కువగా వస్తోంది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ పెర్ఫార్మెన్స్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. “వింటేజ్ ప్రభాస్ బ్యాక్, ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ” అంటూ ట్విట్టర్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటుండగా, కొంతమంది నెటిజన్లు డివైడెడ్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుంటే, కొందరు అవుట్‌డేటెడ్ కమర్షియల్ ట్రోప్స్, లెంగ్తీ రన్‌టైమ్‌ను మైనస్‌లుగా చెబుతున్నారు. అయితే, రాజా సాబ్‌కు బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఓపెనింగ్ డే కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు నెటిజన్లు. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయి కావచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి, ఈ రాజాసాబ్‌ కలెక్షన్ల సునామీ సృష్టించనుందా? సంక్రాంతి సినిమాల్లో వసూళ్ల రారాజుగా రాజాసాబ్‌ నిలవనుందా? అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News