కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కుటుంబ కలహాలతో రోడ్డున పడ్డ మంచు కుటుంబం.. తాజాగా వారి వ్యక్తిగత సిబ్బంది చేస్తున్న పనులతో మరింత చిక్కుల్లో పడుతోంది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి సమీపంలోని గరిగుట్ట అడవిలో అడవి పందులను విష్ణు(Manchu Vishnu) సిబ్బంది వేటాడారు. ఆ సమయంలో మోహన్ బాబు(Mohanbabu), విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో జంతు సంరక్ష కార్యకర్తలు దీనిపై మండిపడుతున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్రప్రసాద్‌పై ఇప్పటికే ఈ తరహా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. మంచు మనోజ్(Manchu Manoj) హెచ్చరించినా వారిద్దరు వినకుండా అడవి పందులను వేటాడినట్లుగా సమాచారం.