సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదం ఉందంటూ పవన్ చెప్పినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కథనాలపై నిర్మాత, అల్లు కుటుంబం సన్నిహితుడు SKN ఖండించారు.
- Advertisement -
దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్‌ను ఒంటరివాడిని చేశారని.. ఈ ఘటనకు బన్నీ ఒక్కడినే ఎలా నిందిస్తారు..? అంటూ పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఇదీ అల్లు అర్జున్ గురించి, సంధ్య థియేటర్ ఘటన గురించి పవన్ చెప్పింది ఇదే అంటూ తెలిపారు. తప్పుడు సమాచారానికి స్వస్తి పలకడానికి ఇదే సరైన సమయం అంటూ పేర్కొన్నారు.