Homeచిత్ర ప్రభKarunakaran: 'తొలి ప్రేమ' డైరెక్టర్‌ రీఎంట్రీ... బెల్లంకొండ హీరోతో క్రేజీ లవ్‌స్టోరీ!

Karunakaran: ‘తొలి ప్రేమ’ డైరెక్టర్‌ రీఎంట్రీ… బెల్లంకొండ హీరోతో క్రేజీ లవ్‌స్టోరీ!

Director Karunakaran: టాలీవుడ్‌ లవ్‌స్టోరీ చిత్రాల్లో ‘తొలి ప్రేమ’ సినిమాది ప్రత్యేక స్థానం. ఎలాంటి జనరేషన్‌ని అయిన ఈ మూవీ బాగా ఆకట్టుకుంది. 90’s అండ్‌ ఎర్టీ 20’sలో యూత్‌ని బాగా ఆకట్టుకున్న లవ్‌స్టోరి ఇదే. పవన్‌ కళ్యాణ్‌, కీర్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. తొలి ప్రేమతో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలకు కొత్త నిర్వచనం ఇచ్చారు.

- Advertisement -

8ఏళ్ల తర్వాత రీఎంట్రీ
దీనితర్వాత హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన కరుణాకరణ్‌ సడెన్‌గా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమయ్యారు. 2018లో వచ్చిన ‘తేజ్ ఐ ల‌వ్‌యూ’ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరుణాకరన్ ఇప్పుడు యువ హీరో బెల్లంకొండ గ‌ణేష్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఈ సినిమా పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది.

అనుదీప్ డైలాగ్స్..
ఈ కార్యక్రమానికి సీనియర్ డైరెక్టర్‌ వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రం న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. కరుణాకరన్ స్టైల్‌కు తగ్గట్లుగా సాఫ్ట్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి మాటలు రాస్తున్నారు. కామెడీ సన్నివేశాల్లో కరుణాకరన్‌కు ప్రత్యేకమైన స్టయిల్ ఉండగా అనుదీప్‌కు కూడా హాస్యంలో మంచి పట్టుంది.

క్రేజీ హీరోయిన్ తో..
అలాంటి వీరిద్దరి కామెడీ సన్నివేశాలు రూపొందుతున్నాయంటే ఈ సినిమా వినోదం ఏ రేంజ్‌లో ఉండబోతుందో మీ ఊహాకే వదిలేస్తున్నాం.  ఇక ఈచిత్రాన్ని భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ గణేశ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్‌ను తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. హీరోయిన్ ఎంపికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత వెయిట్ యాడ్ కానుంది. కరుణాకరన్, అనుదీప్ కలయికలో రాబోతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేశ్ కెరీర్‌లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News