ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి రవి, శృతి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్లు వచ్చాక తొందరగా భోజనం తినేసేయండి అంటే మేము బయట తినేసం అని చెప్తారు. సర్లే అని స్నానం చేయమంటుంది. మీరు చెప్పకపోయినా చేస్తాను అప్పుడే హాయిగా నిద్ర పడుతుంది అని చెప్తుంది శృతి. నిద్రపోవడానికి కాదమ్మా ఇంకా ఒక సాంప్రదాయం ఉండిపోయింది అంటుంది ప్రభావతి. శృతికి మీకు ఈరోజు ఫస్ట్‌నైట్ అని చెప్పలేక ఓ కుస్తీలు పడుతుంది. రోహణి ఏదోలా చెప్తే శృతి నవ్వి ఇంత సింపుల్ విషయానికి ఎందుకిల అయిపోతున్నారు అంటుంది. రోహిణి ప్రభావతిలు శృతి మాటలకు షాక్ అయ్యి ముందే అయిపోయిందా ఏంటి ఇంత ఊజీగా తీసుకుంది అసలు సిగ్గ కుడా పడలేదు అనుకుంటారు.
బాలు మేడ మీద పడుకుని పిచ్చిగా పాటలు పాడుకుంటాడు. జీవిత సత్యాలు మాట్లాడుకుంటాడు. కింద శృతి చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకుందని రోహిణిని కట్టమంటుంది ప్రభావతి. రోహిణి రేడీ చేస్తుంటే మలేషియాలో మీ ఇళ్లు ఎక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు తనకి తెలుస్తుంది చెప్తే అని తెగ అడుగుతుంది శృతి. రోహిణితో మీనా మంచిది కానీ బాలు మంచివాడు కాదు మీనా ఎలా ఉంటుందో తనతో అని శృతి అంటుంది. వాళ్లిద్దరికీ విడాకులు ఇప్పించేద్దాం అని అంటుంది శృతి. రోహిణి ఏమో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని భయపడుతుంది. వాళ్లు మాట్లాడుకుంటూ మనోజ్ జాబ్ విషయానికి వస్తారు. అంతే అది విని మనోజ్ రోహిణిని బయటికి తీసుకొచ్చేస్తాడు. తన రూమ్‌కి తీసుకొచ్చేసి బయటికి వెళ్లుకుండా ఏవొక మాటలుు చెప్పి ఆపుతాడు. అలా చాలా సేపు మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.