ఈరోజు ఎపిసోడ్‌లో అనామిక, సామంత్ నందని చంపిన విషయం గురించి మాట్లాడుకుని ఆనందపడతారు. దీనితో ఇంట్లో గొడవలు ఇంకా పెరుగుతాయని మరన్ని ప్లాన్‌లు వేస్తారు. వాడు చచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ వంద కోట్ల అప్పు వాళ్లే కట్టాలి, వాళ్ల ఆస్తులు అన్ని తాకట్టు పెట్టినా అంత డబ్బు రాదు అని మాట్లాడుకుంటారు. తాకట్టు కాకపోతే అమ్ముకుంటారు అప్పుడే కదా నేను హ్యాపీ అయ్యేది అని అనామిక అంటుంది.
మరోవైపు ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గరికి వెళ్లి ఆస్తి లాక్కోవడానికి కోర్టు నోటీస్ పంపిస్తాను అని చెప్తుంది. ప్రకాశం ఈ ఇంట్లో తింటూ ఇంట్లో వాళ్లమీదనే నోటీస్‌లు పంపించడం తెలివి తక్కువ పని కాదు అంటుంది. ప్రకాశం ధాన్యలక్ష్మికి గడ్డి పెట్టి, మనసు మార్చుకోమని చెప్తాడు కానీ ధాన్యం వినదు. మీరు ఇక్కడే ఉండి, వాళ్లమాటే వింటాను అనేలా ఉంటే నా మెడలో మీరు కట్టిన తాళి తేంచేయమని అంటుంది.
మరోవైపు రాహుల్, రుద్రాణిలు ఇంట్లో కావ్య చేసే పనుల కోసం మాట్లాడుకుంటారు. రాహుల్ ఏమో నాకు ఒక అవకాశం ఇవ్వు మమ్మీ ఆ కావ్యని మర్డర్ చేసేద్దాం అని అనుకుంటారు. రుద్రాణి వద్దని చెప్పినా రాహుల్ వినడు. కావ్య బట్టలు ఆరేయడానికి వెళ్తే రాహుల్ అక్కడ కరెంట్ షాక్ పెట్టి చెంపాలని చూస్తాడు. అక్కడికే స్వప్న వచ్చి నువ్వు చేయకు మా అత్త చేస్తుంది అంటుంది. ఈలోపు రాజ్ కావ్యని పిలిస్తే వెళ్తుంది. అక్కడకి రుద్రాణి వస్తే స్వప్న బట్టలు ఆరేయమని చెప్తుంది నేను చేయను అంటే డబ్బులు ఇస్తాను అంటుంది స్వప్న. సరే అని ఆరోస్తుంది అంతే అక్కడ రాహుల్ పెట్టిన కరెంట్ రుద్రాణికి గట్టిగా తగిలి కాకిలా గిలగిలా కొట్టుకుంటుంది. స్వప్న అక్కడే ఉన్న కర్ర తీసుకుని గట్టిగా కొడితే షాక్ వదులుతుంది. రాహుల్ ఏమో కావ్య చచ్చిపోయి ఉంటుంది వెళ్లి చూద్దాం అనుకునే సరికి అక్కడ రుద్రాణిని చూసి భయపడి రుద్రాణి చచ్చిపోయిందేమో అని భయపతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.