ఈరోజు ఎపిసోడ్లో సత్యం కింద పడుకుంటాను అంటే ప్రభావతి వచ్చి మీరు పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అంటుంది. ఇంట్లో వాళ్లు అందరూ వద్దు అన్నా కుడా వినడు. అప్పుడు బాలు తన రూమ్‌కి వచ్చి మన మంచం కింద హాల్లో వేద్దాం అంటే కింద పట్టదు అంటుంది. సరే ఈ పరుపు వేసేద్దాం అని పట్టుకెళ్లి వాళ్ల నాన్నకు ఇస్తాడు.
మరోవైపు శృతి, రవిలు షాపింగ్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు. సత్యం కింద పడుకోవడం చూసి ఎందుకిక్కడ ఉన్నారు అంటే నీ వళ్లే అంటాడు బాలు. ఇన్ని చెప్తున్నారు మీరు ఎందుకు రూమ్‌కి తాళం వేసుకుని వెళ్లారు ఇదేమైనా లాడ్జ్, జైలు అనుకున్నారా తమ్ముడికి రూమ్ ఇవ్వలేకపోయారు అని అడుగుతుంది శృతి. ఎందుకు పనికిరాని వాళ్లు ఇంట్లో ఉంటే అది జైలే అవుతుంది అంటాడు బాలు. జాగ్రత్తగా మాట్లాడు లేదంటే ఊరుకోను అంటుంది. సత్యం బాలుని ఆపుతాడు.
మేము వెళ్లిపోతాము అని రవి అంటే ఇందుకేనా తీసుకొచ్చింది అని ప్రభావతి అంటుంది. నోరు మూసుకుని లోపలికి వెళ్లు అని మనోజ్, రోహిణిలు చెప్తారు. అప్పుడు శృతి దీని అంతటికీ మీరే కారణం అంకుల్ అంటుంది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు మూడు రూమ్‌లు కట్టించాలి కదా అంటుంది. నాకు నిజంగానే దూరదృష్టి లేదు అని బాధపడతాడు. ఇంక అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్లు వెళ్లిపోతే సత్యం, ప్రభావతి కష్టసుఖాలు మాట్లాడుకుంటారు.
మరోవైపు రవి, శృతిలు బాలు గురించి మాట్లాడుకుంటారు. శృతి ఇక్కడ ఇంట్లో ప్రశాంతంగా ఉందా లేదా అని రవి అడుగుతాడు. ఇద్దరికి ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటారు. అక్కడ బాలు, మీనాలు మళ్లీ రూమ్ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు మా అమ్మ అనే మాటలు పడకు ఒకటి అంటే రెండు అను అని బాలు చెప్తాడు. మొత్తానికి రూమ్ గురించి వాదనలు చేసుకుని పడుకుంటారు. మరోవైపు శృతి పడుకున్న రవిని లేపి బయటికి వెళ్లాలి అని లేపి మేడ మీదకి తీసుకెళ్తుంది. అక్కడ టెంట్ వేసి ఇక్కడే పడుకుందాం అంటుంది. మనకు వచ్చేసరికి రూమ్ ఉంటుందో లేదో అని ఇందాక షాపింగ్‌లో నీకు తెలియకుండా కొన్నది ఇదే అంటుంది. పొద్దున్న లేచి ప్రభావతి శృతికి, కాఫీ తీసుకెళ్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.