Meher Ramesh: టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం నెలకొంది. అతడి అత్తమ్మ పద్మావతి శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇన్నాళ్లు మా అమ్మను అత్తమ్మ పద్మావతిలో చూసుకున్నానని అన్నారు. ఒకే తేదీన మా అమ్మతో పాటు అత్తమ్మ చనిపోయారని తెలిపాడు. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు. మా కుటుంబానికి తీరని లోటు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు మెహర్ రమేష్. అత్తమ్మ పద్మావతి ఫొటోను పంచుకున్నారు.
Also Read – Priyanka Chopra: మరో టైమ్ ట్రావెల్ కథలో ప్రియాంక చోప్రా – వారణాసి తర్వాత సినిమా ఇదేనా
మెగాస్టార్ చిరంజీవికి బంధువుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన కన్నడ మూవీ వీర కన్నడిగతో డైరెక్టర్‌గా మారారు. తెలుగులో డైరెక్టర్‌గా ఎన్టీఆర్‌తో కంత్రి, శక్తి, ప్రభాస్‌తో బిల్లా, వెంకటేష్‌తో షాడో సినిమాలు చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.
చివరగా చిరంజీవి భోళాశంకర్ సినిమాకు దర్శకత్వం వహించారు మెహర్ రమేష్. 2023లో రిలీజైన ఈ మూవీ కూడా మెహర్ రమేష్‌కు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. డైరెక్టర్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా మహేష్‌బాబు బాబీ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించారు. భోళా శంకర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏదన్నది మెహర్ రమేష్ అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
Also Read – Rashmi Gautam: రెడ్ టాప్ లో హాట్ చిల్లిలా బుల్లితెర టాప్ యాంకర్

